‘అరవింద సవేుత’ విడుదల సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఇంటర్వ్యూ…

హిట్.. ఫ్లాప్.. పెద్దగా పట్టించుకోను

‘‘రైటర్, డైరెక్టర్ అని నన్ను నేను రెండుగా విభజించి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకటే సినిమాల్లోలాగా నేను ఇద్దరిని కాదు. ఒక సినిమాను డైరెక్ట్ చేసినప్పుడు అందులో నేను డైలాగులు బాగా రాశాననే అంటే.. అంత మాత్రాన దాన్ని నెగటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగనిదాన్ని కిరీటంగా భావించాల్సిన పనిలేదు’’ అంటున్నారు మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో వచ్చిన
‘అరవింద సవేుత’ విడుదల సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఇంటర్వ్యూ…

ఆయనే ఫోన్ చేశారు…
image– సినిమా రిలీజ్ డేట్ ఆగస్ట్ 29న అనుకున్నాం. ఆ తర్వాత సినిమాను సమ్మర్‌లోనే రిలీజ్ చేయాలని నేను, నిర్మాత చినబాబుగారు అనుకున్నాం. జనవరిలో వేరే సినిమాలు ఉండటం వల్ల మార్చిలో సినిమాను విడుదల చేయాలనేది మా ఆలోచన. ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం జరిగిన రోజు ఆయనతోనే ఉన్నాం. రెండో రోజు రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఎన్టీఆర్‌గారే ఫోన్ చేశారు. ‘ఎట్టి పరిస్థితుల్లో మనం అక్టోబర్ 11కే వస్తున్నాం. ఈ విషయాన్ని చినబాబుగారికి కూడా చెప్పండి’ అని అన్నారు. ‘ఇప్పుడేం పరావాలేదు.. పదిరోజుల తర్వాత మాట్లాడుకుందాం’ అని నేను అంటే ‘పదిరోజులా! అంత లేదు.. ఇప్పటికే షూటింగ్ ఆలస్యమైంది.. పూజా కూడా ఇక్కడే స్టే చేస్తుంది. మూడు రోజుల వరకు నేను బయటకు రాకూడదు’ అన్నారు. నాలుగో రోజు ఆయన సెట్‌కు వచ్చేశారు.

 

 

అదే కొత్త కోణం అనిపించింది..
– నిజానికి ముందు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేద్దామని అనుకోలేదు. రెండు మూడు ఐడియాలు వచ్చాయి. ఆ సమయంలో వచ్చిన ఆలోచన ఇది. ఒక గొడవ జరిగే ముందు.. గొడవ జరిగే సమయంలో విషయాలు గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఘటన జరగడానికి ముందు.. తర్వాత యాక్షన్ మిక్స్ అవడంతో ఎమోషన్స్‌కు మనం కనెక్ట్ అవుతాం. ఇంతకు ముందు సక్సెస్ అయిన ఫ్యాక్షన్ సినిమాలను గమనిస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. పోయినవాళ్ల ఫ్యామిలీలు.. ఉన్నవాళ్ల ఫ్యామిలీల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది.. కచ్చితంగా కొత్త కోణం అవుతుందనిపించింది. ఆసక్తికరంగా ఉంటుందనిపించింది. గొడవల్లో ఇప్పటి వరకు ఆడవాళ్లను ఎవరూ ఇన్‌వాల్వ్ చేయలేదు. ఎందుకనో మనం ఇంట్లో ఆడవాళ్లను పెద్దగా పట్టించుకోం. అలా కాకుండా వాళ్లని కన్‌సిడర్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను కథగా రాసుకుని ఎన్టీఆర్‌కు చెప్పాను. తనకు బేసిక్‌గా నా ఆలోచన నచ్చింది.

అందరికీ నచ్చిన కాన్స్‌ప్ట్
– కోబలి సినిమా రీసెర్చ్ సమయంలో నేను కొంతమంది రాయలసీమ కవులను కలిశాను. తిరుమల రామచంద్రగారి image

సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. నాకు భరణిగారు హంపి నుంచి హరప్పా దాకా ఉందని ఇచ్చారు. అక్కడ లాంగ్వేజ్, పడికట్టు ఏది తెలియాలన్నా ఇది చదివితే చాలని చెప్పారు. నేను అప్పటికే నామిని సాహిత్యానికి పెద్ద ఫ్యాన్‌ని. కాకపోతే ఆయన తాలూకు చిత్తూరు జిల్లా భాగం.  అక్కడ కరువు ప్రాంతం. అక్కడ ఫ్యాక్షన్, కక్షలు, కార్పణ్యాలు లేవు.  నాకు కడప, అనంతపూరు ఏరియాల్లో.. ఫ్యాక్షన్ ఉంది. ఇక్కడున్న కరువు ఫోర్స్‌డ్ కరువు. పెనిమిటి పాట కూడా ఈ ప్రాసెస్‌లోనే కుదిరింది.  అందరి ఆడవాళ్లకీ హీరో మదర్‌ని సింబలైజ్ చేశాం. నేను చెప్పగానే అందరికీ నచ్చిన కాన్సెప్ట్ ఇది.

 

 

ఫ్యాన్స్ సినిమాకే..
బిగినింగ్‌లో కొంత కామెడీ ఉంటుంది. ఎక్కడా బలవంతంగా ఉన్నట్లు అనిపించదు. ఇంతకు ముందు బ్రహ్మానందంగారి లాంటి వారిని పట్టుకొచ్చి ఒక ఐటెమ్ చేసేవాళ్లం కదా.. అలా చేయదలచుకోలేదు. కొంచెం స్ట్రిక్ట్‌గా కథ ఏం చెబుతుందో అదే విందామని అనుకున్నా. సినిమాకు ఫ్యాన్స్ ఉంటారు గానీ, మనకుంటారని నేననుకోను.

12 ఏళ్ల అనుబంధం…
imageఎన్టీఆర్‌తో 12 ఏళ్ల అనుబంధం.‘నాన్నకు ప్రేమతో’ నుంచి మొదలైంది… ఆయనేమో ఆ సినిమా చేస్తున్నారు. నేనేమో ‘అ..ఆ’ చేస్తున్నా. అప్పటి నుంచి ఇద్దరం కలిసి సినిమా చేయాలనే ఆలోచిన సీరియస్‌గా అనిపించింది. నాతో ఉన్న సమస్య అంటే రాత్రి నాకు ఏదో ఒక ఐడియా వస్తుంది.. లేచి కూర్చుని సూపర్ అని రాసుకుంటా. నిద్రలేచి చూస్తే నాకే సిగ్గుగా ఉంటుంది. ఈ ఐడియా ఎందుకు రాశానా? అని. అఫ్‌కోర్స్ నేను తీసిన సినిమాలు చాలా చూసినప్పుడు కూడా అనిపిస్తుంది కానీ.. ఇప్పుడు కూడా అనిపించింది.

పెద్దగా పట్టించుకోను…
జయాపజయాలను పెద్ద పట్టించుకోను. నాకు ఏదైనా కొత్తగా చూసినప్పుడు, చదివినప్పుడు మాత్రమే  కిక్ వస్తుంది. హిట్, ఫ్లాప్‌లు పట్టించుకోనంటే అబద్ధమే. పట్టించుకుంటా. కానీ ఓ.. పిసికేసుకోను. నాకు ‘అత్తారింటికి దారేది’ వచ్చినప్పుడు  అలాగే ఉంటా. ‘అజ్ఞాతవాసి’ వచ్చినప్పు డూ అలాగే ఉంటా. ఫ్లాప్ అయినప్పుడు బాధపడతా. కాకపోతే ఓ రెండు, మూడు రోజులు.. అంతే. అయిపోయిన తప్పులు మనకు తెలుస్తాయి. చూడకూడదనుకుంటే ఎప్పటికీ చూడం. తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే తెలుస్తుంది. దానికి ఎక్కువ సమయం పట్టదు. డస్ట్ బిన్ మెళ్లో వేసుకుని తిరగడం దేనికి.. ఫ్లవర్ బొకే అయితే తిరుగుతాం. సినిమా నచ్చడానికి లక్ష కారణాలుంటాయి. నచ్చకపోవడానికి లక్ష కారణాలుంటాయి. దాని గురించి మనం ఏమీ మాట్లాడలేం. మాట్లాడేకొద్దీ మనం వీక్ అవుతామే తప్ప, ఇంకేమీ జరగదు.

ఎవరూ తక్కువ వాళ్లు కారు…
మీతో ఎలా ఉన్నానో.. నా హీరోలతో కూడా అలాగే ఉంటాను. నేను తెలివితేటలు చూపిస్తే వాళ్లు ఇంకెన్ని తెలివిimage తేటలు చూపించాలి.

నేను పనిచేసిన ఎవరూ కూడా తక్కువ వాళ్లు కాదు. సురేశ్‌బాబుగారు, స్రవంతి రవికిషోర్, అల్లు అరవింద్.. అందరూ ఎన్నో ఎత్తు పల్లాలను చూసినవాళ్లే. మనం వెళ్లి కూర్చుని మొదలుపెట్టగానే మన మైండ్‌లో ఏముందో.. స్క్రిప్ట్ సేల్ చేయడానికి వస్తున్నాడా..? కథ చెప్పడానికి వస్తున్నాడా? కూడా చెప్పేయగలరు.

అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు
మామూలుగా సునీల్  గత రెండేళ్లుగా ‘నేను ఇందులో బంధీనైపోయాను. ఎలాగైనా బయటపడాలి. ఏదో ఒకటి చేయాలి అని..’ అంటూనే ఉన్నాడు. అప్పుడు నేనన్నా.. ‘అది నేచురల్‌గా జరుగుతుంది. నువ్వు పెద్దగా దాని గురించి ఆలో చించకు. నీ చేతిలో ఉన్న కమిట్‌మెంట్స్ అన్నీ ముందు పూర్తి చెయ్. ఆ తర్వాత హీరోగా కొత్తవేవీ ఒప్పుకోవద్దు. అప్పుడు నేచురల్‌గా ఎందుకు జరగదో చూద్దాం’ అని అన్నా. నేచురల్ గానే మా కన్నా ముందే ‘సిల్లీఫె లోస్’ మొదలైం ది. విడుదలైంది. ఎప్పుడైతే సునీల్ మెంటల్‌గా దాన్నుంచి బయటికి వచ్చాడో, అప్పుడే ఆటోమేటిక్‌గా అందరికీ తెలిసిపోయింది. అలాంటివి మనం చెప్పాల్సిన పనిలేదు. అందరికీ ఇట్టే తెలిసిపోతాయి.

మన దగ్గర అంత తేలిక కాదు…
imageభీమవరం నుంచి వచ్చినప్పుడు నేను కూడా ఇంగ్లిష్ సినిమాలు చూసేవాడిని. అలాగే తీయాలనుకునేవాడిని. కానీ వాళ్లకు సింగిల్ జోన్రా ఉంటుంది. కానీ మనదగ్గర అలా కాదు. మనం ఒకే సినిమాలో అన్నిటనీ చూడ్డానికి అలవాటు పడిపోయాం. అందువల్ల మన దగ్గర అది అంత తేలిక కాదు. ఆ ప్యాట్రన్‌ని బద్ధలు కొట్టేవారు ఎవరో ఒకరు రావాలి. మాకు మాత్రం తీయాలని ఉండదా? అని ప్రతి ఒక్కరం చెబుతుంటాం. అందులో నేనేమీ అతీతుణి కాదు. కాకపోతే ప్యాట్రన్‌ని బద్ధలు కొట్టాలి. ‘లవకుశ’ కలర్‌లో విడుదలైన 12 సంవత్సరాల దాకా కూడా కలర్‌లో మనం తీయలేదు. అప్పటికి హిందీ, తమిళ్.. అన్నీ కలర్‌లోకి వెళ్లాయి. తమిళ్‌లో కొత్తవాళ్లతో తీసిన ‘కాదలిక్క నేరమిలై’్ల కలర్‌లో ఉంటుంది. తెలుగులో పెద్ద హీరోలతో తీసిన సినిమాలు కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయి. అంటే అప్పటికి మనకు కలర్ అంటే భయం. ఆ ప్యాట్రన్ బ్రేక్ చేయడానికి భయం. కానీ ఇప్పుడు మనం ఆ భయాన్ని బ్రేక్ చేస్తున్నామని అనిపిస్తోంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆ బ్రేక్ ఏదో రకంగా జరుగుతూనే ఉంటుంది.

నా నిర్మాతలు చెప్పరు..
నా నిర్మాతలు నా సినిమాలకు ఎంత బడ్జెట్ అయ్యిందనే విషయాన్ని నాకు చెప్పరు. అయితే దర్శకుడికి బడ్జెట్ ఎంత పెడుతున్నామనే దానిపై కొంచెంగా ఉండాలి. ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువుంటే కథ రాసేటప్పుడే ఇటలీలో జరిగే కథ.. ఇండియా లోకి.. ఇంకెక్కడో జరిగేది ఇంట్లోకి.. ఇలా మెల్లగా మారిపో తుంది.

జర్నీ కూడా ముఖ్యమే…
రిజల్ట్ ముఖ్యంకాదు.. జర్నీ కూడా ముఖ్యమే కదా. ఏదో ఒక కాలమ్ రాశారనుకుందాం. అది సరిగా రానంత మాత్రాన మీరు పనికి రారంటే ఎలా? ఎన్ని చదువుకుని, ఎన్నో కలలతో ఊరి నుంచి రావడం, ఇక్కడ కలిసిన వ్యక్తులు… ఈ ప్రయాణం.. ఇదంతా చాలా ముఖ్యం కదా. అది 90 పర్సెంట్. ఫైనల్ టిప్ 10 శాతం. అదే రిజల్ట్.

ముందుగా ప్లాన్ చేసుకోను…
మహిళ ప్రాధాన్యత వచ్చేలా టైటిల్స్ పెట్టాలని నేను ఎప్పుడూ ప్లాన్ చేసుకోను. హీరోయిన్స్‌ను గ్లామర్‌గా చూపించమని డైరెక్టర్స్ అడిగినా నాకు తెలియదనే చెప్పేస్తాను. ఎందుకంటే నాకు అలా చూపెట్టడం తెలియదు. నేను ట్రై చేయలేదు.

అందులో మోహమాటం లేదు…
ఎన్టీఆర్ పక్కన నేను నిలబడ్డానని చెప్పడం ఆయన మంచితనం గానీ… నిజం చెప్పాలంటే ఎన్టీఆర్‌గారే మా పక్కనimage నిలబడి సినిమా పూర్తి చేశారు. అది నిజం! ఇందులో మోహమాటం ఏం లేదు. ఓపెన్‌గా చెబుతున్నా. హరికృష్ణగారి మరణం తరవాత ఎన్టీఆరే సెకండ్ డే ఫోన్ చేసి, ‘నేను వస్తాను. మీరేం వర్రీ అవకండి’ అని చెప్పారు. ‘మీరు కంగా రు పడకండి. బాధ పడకండి’ అని మేము చెప్పింది తక్కువే. ఎందుకం టే… మాటలతో చెబితే తగ్గే విషాదం ఏమీ కాదు. అందువల్లే, ప్రీ రిలీజ్ వేడుకలో నేను ఒక్క మాటే మాట్లాడాను. ‘అంత పెద్ద విషాదంనుంచి అంత త్వరగా బయటకు వచ్చారు’ అని. తన విషాదాన్ని తనకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. మిగతా ఎవరికీ పంచి పెట్టలేదు.

రాజకీయాలు మాట్లాడుకోం..
పవన్‌కల్యాణ్‌గారు రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల ఇద్దరం మధ్య దూరం పెరగలేదు.  పదేళ్ళ నుంచి మేం అలాగే ఉన్నాం. మేమిద్దరం కలిస్తే అసలు సినిమాల గురించి మాట్లాడుకోం. ఇక ఆయనకు సలహాలిచ్చేంత సీన్ లేదు. ఎందుకంటే ఆయన ఏం చేసినా వాళ్ళ అన్నయ్యకు, వాళ్ళ అమ్మకు చెప్పడు. అందరూ తెల్లారిన తరవాత పేపర్‌లో చదువుకోవడమే.

ఆ స్థితి రాకుండా ఉంటే చాలు…
జీవితంలో నేను ఒక్కసారి ఎవరికైనా ఫ్రెండ్ అయితే ఫ్రెండే. నా భీమవరం ఫ్రెండ్స్ ఇప్పటికీ వాళ్లే నా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక ఎవరు ఫ్రెండ్స్ అయితే వాళ్లే ఫ్రెండ్స్. అందరితో నేను బావుంటాను. మహేశ్‌బాబు, ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్… ఒక్కసారి నా జర్నీ స్టార్ట్ అయితే చచ్చేవరకూ ఆగదు. నేను ఏది నమ్ముతాను అంటే.. భార్య ఇచ్చే సలహాలు భర్త ఎన్ని వింటాడు. అలాగని, భార్యను ఎందుకు వదలడు? ఆ రిలేషన్‌షిప్‌లో ఒక సెన్స్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది. స్నేహితులుకు  గానీ… కుటుంబం గానీ… సలహాలు ఇవ్వాలనో, ఎడ్యుకేట్ చేయాలనో కాదు. ఇట్స్ సెన్స్ ఆఫ్ కంఫర్ట్. స్నేహితుడు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. మనల్ని జడ్జ్ చేయకుండా మన భావాల్ని పంచుకోవాలి. పవన్, మహేశ్, ఎన్టీఆర్… ఈ స్థాయికి వచ్చిన వ్యక్తులకు సలహాలు ఏం ఇస్తాం. మనం ఏం సలహాలు ఇవ్వాలి. వాళ్లు మనకు సలహాలు ఇచ్చే స్థితికి రాకుండా ఉంటే చాలు.

Aravindha Sametha Veera Raghava is an upcoming 2018 Telugu action film, produced by S. Radha Krishna on Haarika & Hassine Creations banner and directed by Trivikram Srinivas. Wikipedia
Release date11 October 2018 (India)
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *