శ్రీదేవిగా రకుల్ ఫస్ట్‌లుక్

నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్‌టిఆర్’. రెండు భాగాలుగా(యన్‌టిఆర్- కథానాయకుడు, యన్‌టిఆర్- మహానాయకుడు) రానున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ఎన్టీఆర్‌గా కనిపిస్తున్నారు. ఇక అలనాటి సూపర్‌స్టార్ శ్రీదేవి పాత్రలో ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా.. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌లో శ్రీదేవిగా రకుల్ పర్వాలేదనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఆకుచాటు పిందె తడిసే పాటలో శ్రీదేవిగా రకుల్, బాలయ్యతో ఆడిపాడనున్నట్లు సమాచారం.

కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్ నటిస్తుండగా.. రానా, ప్రకాశ్ రాజ్, సుమంత్, నరేశ్, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి, బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం జనవరి 9న రానుండగా.. రెండో భాగం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *