అందరూ చూస్తుండగానే అత్తాపూర్‌లో దారుణ హత్య

Attapur Murder: హైదరాబాద్‌‌లో పోలీసుల కళ్లెదుటే దారుణ హత్య!

అత్తాపూర్‌లో పట్టపగలే అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది.

హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఎర్రగడ్డలో ఓ వ్యక్తి తన కుమార్తెపై కత్తితో దాడి చేసిన సంఘటన మరవక ముందే.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే మరో ఉదంతం చోటుచేసుకుంది. పోలీసుల కళ్లెదుటే నలుగురు దుండగులు ఓ వ్యక్తిని వెంటాడి.. వెంటాడి మరీ.. గొడ్డలితో కిరాతకంగా హత్య చేశారు.

ఈ ఘటన రాజేంద్రనగర్‌ పరిధి అత్తాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధి అంబర్‌ బజార్‌కు చెందిన రమేశ్‌ (35) అనే వ్యక్తి బుధవారం ఓ హత్య కేసులో ఉప్పరపల్లి కోర్టుకు హాజరయ్యాడు. ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తుండగా దుండగులు అతడిని వెంటాడారు. దీంతో, రమేష్ ఆటో దిగి పరిగెత్తాడు.

అత్తాపూర్ మెట్రో పిల్లర్ 143 వద్ద ఉన్న బస్టాప్ వద్దకు పరిగెడుతుండగా దుండగులు అతడిపై గొడ్డలితో దాడిచేశారు. చంపొద్దని మొత్తుకుంటున్నా దారుణంగా నరికి చంపారు. స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. ఓ దుండగుడు రమేష్‌ను నరుకుతూనే ఉన్నాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ అతన్ని అడ్డుకున్న పక్కకు తోసేసి మరీ రమేష్‌ను నరికారు. ఈ సమాచారం తెలిసి ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులను చూసి కూడా దుండగులు భయపడలేదు. వారి కళ్లెదుటే రమేష్‌పై మరోసారి దాడి చేశారు. నిందితులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *