శ్రీయకు పెళ్ళయ్యింది.. ఇవిగో ఫోటోలు

ఇప్పుడు అందరూ కూడా అస్సలు స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ నిజంగానే పెళ్ళి చేసుకుందా లేదా అనే సందిగ్దంలో ఉన్నారు. నిజానికి మార్చి 12న ఈమె వివాహం ఉదయపూర్ లో జరుగుతందని రూమర్లు వచ్చినా కూడా.. దాని గురించి ఏమాత్రం న్యస్ అనేదే బయటకు రాలేదు. అయితే ఆమె పెళ్ళి జూహూలోని తన త్రిపుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్లో అయిపోయిందని వార్తలు వచ్చిన సందర్భంలో.. అది నిజమా కాదా అని చాలామందికి సందేహం ఉంది. అదిగో ఇప్పుడు నిజమేనని ప్రూవ్ అయ్యింది.

నిజానికి మార్చి 12నే ముంబాయ్ లో పెళ్ళి చేసుకున్న శ్రీయ.. ఇప్పుడు నిన్న (19న) తన బంధువులకు ఆత్మీయులకు కొందరు స్నేహితులకు ఉదయపూర్ లోని ఒక హోటల్లో రిసెప్షన్ పార్టీ ఇచ్చింది. దానికి సంబంధించిన ఫోటోలను ఇప్పుడు స్వయంగా శ్రీయ ఫ్యాన్స్ ఆన్ లైన్లో షేర్ చేస్తున్నారు. ఈ మధ్యనే నీకు పెళ్ళయ్యిందా శ్రీయ అని ఒక నేషనల్ మీడియా వారు స్వయంగా అడిగితే.. దాని గురించి మాట్లాడబోను అని చెప్పింది అమ్మడు. కాని రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ మరియు రెస్టారెంట్ల ఓనర్ అయిన ఆండ్రీ కొస్చీవ్ తో అమ్మడి వివాహం అయిపోయింది.

తన వివాహాన్ని సీక్రెట్ గా ఉంచిన శ్రీయ.. రిసప్షన్ ఫోటోలను మాత్రం ఎందుకో లీక్ చేసింది. అయితే పెళ్ళయినా కూడా.. ఒక రాధికా ఆప్టే తరహాలో అమ్మడు హాట్ హాట్ రోల్స్ నుండి అమ్మ పాత్రల వరకు ఎందులోనైనా నటిస్తుందట. అందుకే పెళ్ళిని సీక్రెట్ గా ఉంచింది. అది సంగతి.

Source: tupaki.com

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *