టీనేజ్ అమ్మాయిలు బ‌రువు త‌గ్గేందుకు 9 మార్గాలు.

టీనేజీ వ‌య‌సు ఎంత ఉల్లాసంగా, ఆనంద‌క‌రంగా ఉంటుందో అన్నే క‌ష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ బాగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. అటు ఎగ్జామ్స్‌, ఇటు బాయ్ ఫ్రెండ్స్‌తో క‌ష్టాలు, కెరీర్ ప్లాన్స్ అన్నీ క‌లగ‌లసి ఉంటాయి. దీనికి అద‌నంగా ఈ మ‌ధ్యే ఒబేసిటీ స‌మ‌స్య తీవ్ర‌త‌ర‌మ‌వుతుంది. అమెరికాలో 21 శాతం టీనేజ్ అమ్మాయిలు ఒబేసిటీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. టీనేజ్ ఒబేసిటీ వ‌ల్ల ఆత్మ‌విశ్వాసం కోల్పోవ‌డం, బులీమియా, డ‌యాబెటిస్ లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ట‌. టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు బ‌రువు త‌గ్గాలంటే కొన్ని స‌రైన విధానాలున్నాయి. మ‌రి అవేమిటో తెలుసుకుందామా?

1. వైద్యుడ్ని సంప్ర‌దించాలి…

బ‌రువు త‌గ్గే క్ర‌మంలో వంశ‌పారంప‌ర్య కార‌ణాలు, శ‌రీర ఎత్తు, బ‌రువు, వైద్య చ‌రిత్ర‌, శ‌రీర త‌త్వం లాంటివ‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకోవాలి. ఇవ‌న్నీ వైద్యుడ్ని సంప్ర‌దిస్తే స‌రిగ్గా చెబుతాడు. బ‌రువు త‌గ్గాల‌నుకుంటే ఈ విధానాలు పాటిస్తే స‌రి.

2. సోడాను వ‌దిలేయండి…

సోడాను వ‌దిలేయండి అన‌గానే మీ మ‌న‌సు గాయ‌ప‌రిచామ‌నుకుంటా. అయినా త‌ప్ప‌దు. సోడాలో క్యాల‌రీలుంటాయి. క్ర‌మేణా బ‌రువు పెర‌గ‌డ‌మే కాదు చ‌ర్మం కాంతివిహీనంగాను మారుతుంది. మొత్తానికి మానేయ‌లేక‌పోతే లో క్యాల‌రీ, డైట్ సోడాను తీసుకోవ‌చ్చు. సోడాతో పాటు కాఫీ, ప్యాకేజీ ఫుడ్స్ ను కూడా మానేయండి.

3. జంక్‌కు చెప్పండి నో…

జంక్ ఫుడ్ మానేయ‌డం కాస్త క‌ష్ట‌మే. జంక్ ఫుడ్ సులువుగా బ‌రువు పెంచేస్తుంది, ఆ త‌ర్వాత త‌గ్గించుకోవ‌డం క‌ష్ట‌మే. జంక్ ఫుడ్ మానేయ‌క‌పోతే బ‌రువు త‌గ్గ‌డాన్ని క‌ల‌లో కూడా వూహించ‌లేం. మొత్తానికి జంక్ ఫుడ్ మానేయ‌డం క‌ష్ట‌మే. అయితే కొన్ని ఆరోగ్య‌క‌ర ఆప్ష‌న్లు ఉన్నాయి. పాప్‌కార్న్ మానేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు కూల్‌డ్రింక్ బ‌దులు మిన‌ర‌ల్ వాట‌ర్ తీసుకోవ‌చ్చు. చిప్స్‌కి బ‌దులు శాండ్‌విచ్‌తో స‌రిపెట్టుకోవ‌చ్చు. స్వీట్స్ అంటే ప‌డి చచ్చేవారు తాజా పండ్లు తీసుకుంటే స‌రిపోతుంది. పండ్లు ముక్క‌లుగా కోసుకొని గ‌డ్డ పెరుగు వేసుకొని తింటే ఆ మాజ‌యే వేరు.

4. అల్పాహారం మానేస్తున్నారా..

రోజులో అతి ముఖ్య‌మైన‌ది అల్పాహారం. ప్రతి రోజు మానేస్తుంటే ఒక్క‌సారి ఆలోచించండి. బ‌రువు పెర‌గ‌డానికి ఇదీ కార‌ణ‌మే. ఉద‌యం లేచిన గంట‌లోపు అల్పాహారం తీసుకోవాల‌ని నిపుణులు చెబుతారు. మంచి బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు, ఫైబ‌ర్‌, కార్బొహైడ్రేట్లు స‌మ‌పాళ్ల‌లో ఉండాలి. బీవ‌రేజెస్ కి బ‌దులు తాజా పండ్ల ర‌సాలు తీసుకుంటే మేలు.

5. ఫాస్ట్‌ఫుడ్‌కు స‌సేమిరా…

ఫ్రైడ్ చికెన్‌, బ‌ర్గ‌ర్, పిజా లాంటివ‌న్నీ అనారోగ్య‌క‌ర‌మైన‌వే కాదు చెడు కొవ్వు, కార్బొహైడ్రేట్ల‌తో నిండి ఉంటాయి. టీనేజ‌ర్ల‌కు ఫాస్ట్ ఫుడ్స్ అంటే బాగా ఇష్టం. అయితే ఇవి లావును పెంచి ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను పెంచుతాయి. క్ర‌మేపీ గుండె స‌మ‌స్య‌లు వ‌చ్చినా ఆశ్చ‌ర్యంలేదు.

6. ఆట‌లాడండి…

ఆట‌లు ఆడండి… అవును మీరు చ‌దివింది నిజ‌మే. కాసేపు ప్లే స్టేష‌న్‌, ఎక్స్ బాక్స్‌, స్మార్ట్ ఫోన్‌ల‌ను ప‌క్క‌న పెట్టేయండి. బ‌య‌ట‌కు వెళ్లి రియ‌ల్ గేమ్ ఆడండి. అవి మిమ్మ‌ల్ని ఫిట్‌గా ఉంచ‌డ‌మే కాదు బ‌రువు త‌గ్గ‌డంలోనూ స‌హ‌క‌రిస్తాయి. అంతే కాదు టీమ్ బిల్డింగ్ స్కిల్స్‌ను పెంచుతాయి. ఏకాగ్ర‌త బాగా పెరుగుతుంది. టెన్నిస్‌, బ్యాడ్మింట‌న్‌, క్రికెట్ లాంటివి ఇష్టం లేక‌పోతే సైక్లింగ్‌, రన్నింగ్ చేయ‌వ‌చ్చు.

7. ఒంటికి యోగా మంచిదేగా…

బ‌రువు తగ్గ‌డానికి యోగా చేయ‌డం చాలా ఉత్త‌మం. త‌ర‌త‌రాలుగా ఇది రుజువైంది. శ‌రీరంతో పాటు జీవితంలోనూ అనేక మార్పులు గ‌మ‌నించ‌వ‌చ్చు. ఆత్మ‌, శ‌రీరం చాలా కామ్ అయిపోతాయి. శ‌రీరంలోకి శ‌క్తి బాగా వ‌చ్చి చేరుతుంది. రెగ్యుల‌ర్ యోగా బోర్ కొట్టిస్తే మిశ్ర‌మ వ‌ర్క‌వుట్ల‌ను ప్ర‌యోగించ‌వ‌చ్చు.

8. ప‌రీక్ష‌లు సులువుగా తీసుకోండి…

ప‌రీక్ష‌లను లైట్‌గా తీసుకోమ‌ని చెప్ప‌డం సులువే కానీ ఆచ‌రించ‌డం క‌ష్టం. మెద‌డును క‌ష్ట‌పెట్ట‌డం మానేయాలి. చ‌దివినా, చ‌ద‌వ‌క‌పోయినా ఆందోళ‌న ప‌డొద్దు. ఒక‌వేళ చ‌దివితే సాటివారికి పాఠాలు చెప్తే పున‌శ్చ‌ర‌ణ చేసిన‌ట్ట‌వుతుంది. చ‌ద‌వ‌క‌పోయినా దాని గురించి ఆందోళ‌న ప‌డొద్దు. దీని వ‌ల్ల ఎక్కువ‌గా తినేసి ఒబేసిటీ లాంటి స‌మ‌స్య‌ల‌ను కొనితెచ్చుకుంటాం.

9. బాగా నిద్ర‌పోవాలి…

నిద్ర త‌గ్గించుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డంతో పాటు ఒత్తిడిగా అనిపిస్తుంది. దీని వ‌ల్ల ఎక్కువ‌గా తినేస్తాం. ఆక‌లి లేక‌పోయినా ఏదో ఒక‌టి తిన‌డం అల‌వాటు అవుతుంది. నిద్ర లేమి వ‌ల్ల రోజువారీ ఎక్స‌ర్‌సైజులు కూడా మానేయాల్సి ప‌రిస్థితి రావొచ్చు. దీన్ని నివారించేందుకు నిద్ర పోయేందుకు రోజులో ఒకే స‌మయాన్ని కేటాయించుకోండి. అంతే కాదు టీవీ ఆన్‌చేసి ప‌డుకోవ‌ద్దు. వెలుతురు వ‌ల్ల గాఢ నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. చూశారు క‌దండి బ‌రువు త‌గ్గేందుకు ఉన్న ఈ 9 మార్గాల‌ను. వీటితో పాటు ఇంకొన్ని అంశాల‌ను దృష్టిలో పెట్టుకోవ‌చ్చు… అవేమిటంటే… * రోజుకు 5 నుంచి 6 సార్లు ప్ర‌తి 2 లేదా 3 గంట‌ల‌కోసారి తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. * కొవ్వు ప‌దార్థాలు మానేయాలి * బ‌రువు త‌గ్గించే బిల్ల‌ల‌ను తీసుకోవ‌ద్దు. * ఎన‌ర్జీ డ్రింక్‌ల జోలికి వెళ్ల‌కండి. * ఆత్మ నిగ్ర‌హాన్ని అల‌వర్చుకోండి. ఈ టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా, ఫిట్‌గా త‌యార‌వ్వ‌డ‌మే కాదు న‌డుము చుట్టుకొల‌త త‌గ్గుతుంది. మ‌రింకేం ప్ర‌ణాళిక వేసుకొని ల‌క్ష్యాలు ఏర్ప‌ర్చుకొని ఆహారాన్ని, డైట్, వ్యాయామం పాటించండి. ఆల్ ద బెస్ట్‌!

Source: telugu.boldsky.com

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *